TS KGBV JOBS : నియామక గైడ్‌లైన్స్ & షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ (ఆగస్టు – 11) : తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు మరియు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సమగ్ర శిక్షా పథకం కింద కాంట్రాక్టు పద్ధతిలో టీచింగ్ సిబ్బంది భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కు సంబంధించిన రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. (ts kgbv and URS Contract jobs guidelines and schedule)

ఈ నేపథ్యంలో అభ్యర్థుల తుది ఎంపిక సంబంధించి షెడ్యూల్ ను‌, గైడ్ లైన్స్ ను విద్యాశాఖ విడుదల చేసింది.

★ షెడ్యూల్ & గైడ్‌లైన్స్

ఆగస్టు – 10 :- డీఈవో కార్యాలయాలు మరియు ఎంఆర్సీ కార్యాలయాల్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రదర్శించాలి. 1:3 నిష్పత్తిలో సబ్జెక్టు వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం వారికి సమాచారం అందించాలి.

ఆగస్టు – 11 :– 1:3 నిష్పత్తి లో ఎంపిక చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన, టెట్ మార్కుల వెయిటేజ్ మరియు రిజర్వేషన్లు ఆధారంగా 1:1 నిష్పత్తిలో అభ్యర్థుల తుది జాబితాను ఎంపిక చేయాల్సి ఉంటుంది. రోస్టర్ కమ్ మెరిట్ లిస్ట్ ఆధారంగా 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలి

ఆగస్టు – 12 :- 1:1 నిష్పత్తిలో ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా పట్ల ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాటిని పరిశీలించి పరిష్కరించాలి. అభ్యంతరాలు పరిశీలించిన పిమ్మట తుది జాబితాను డీఈవో మరియు ఎంఆర్సీ ఆఫీసుల్లో ప్రదర్శించాల్సి ఉంటుంది.

ఆగస్టు – 13 :- ఎంపికైన అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఆగస్టు 13వ తేదీ సాయంత్రం 5.00 గంటలలోపు ఎంపికైన పాఠశాలల్లో రిపోర్ట్ చేయవలసిందిగా సూచించాలి.

ఎంపికైన అభ్యర్థులు పాఠశాలలో రిపోర్ట్ చేసిన తేదీ అనగా ఆగస్టు 13 – 2023 నుండి ఏప్రిల్ 24 – 2024 వరకు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయాల్సి ఉంటుంది.