తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల్లో విద్యార్థులకు ఈసారి మరింత ఛాయిస్ ఇచ్చేలా ప్రశ్నల సంఖ్యను పెంచడం పై దృష్టి ఇంటర్మీడియట్ బోర్డు పెట్టినట్లు సమాచారం.
ప్రస్తుతం ఇంటర్లో అతి స్వల్ప జవాబు ప్రశ్నల్లో అసలే ఛాయిస్ లేదు. మిగిలిన షార్ట్, లాంగ్ జవాబు ప్రశ్నల్లో కొంతమేర ఛాయిస్ ఉంది.
ఉదాహరణకు జువాలజీ ప్రశ్నపత్రం తీసుకుంటే మూడు భాగాలు ఉంటాయి. అందులో 2 మార్కుల అతి స్వల్ప జవాబు ప్రశ్నలు 10 ఇస్తారు. అన్నిటికీ సమాధానాలు రాయాలి. ఇక 4 మార్కుల స్వల్ప జవాబు ప్రశ్నలు ఎనిమిది ఇస్తే అయిదు, 8 మార్కుల దీర్ఘ జవాబు ప్రశ్నలు 3 ఇస్తే 2 రాయాలి. ఈ రెండింటిలో కూడా ఈసారి మరింత ఛాయిస్ పెంచనున్నారు. అంటే దాదాపు 50% ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాసేలా ఉండొచ్చని సమాచారం.
అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాలూ కూడా ఇదే తరహాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. దాని వల్ల విద్యార్థులకు మీద ఒత్తిడి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
సైన్స్ గ్రూపు విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు కూడా ఉంటాయని సమాచారం.
Follow Us@