జూనియర్ కళాశాలలో విద్యార్థుల డేటా లో తప్పులను సరిదిద్దే అవకాశం.

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ 2021 వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జూనియర్ కాలేజ్ విద్యార్థుల డేటాలో ఉన్న తప్పులను సవరించడానికి ఇంటర్ బోర్డు ప్రిన్సిపాల్ కు ఆదేశాలు జారీ చేసింది.

కళాశాల వెబ్సైట్ నందు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల కు సంబంధించిన జనరల్ ఒకేషనల్ విద్యార్థుల డేటా లోని తప్పులను సరి చేయాలని దీనికోసం విద్యార్థికి 300 రూపాయలు చొప్పున బోర్డుకు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటన విడుదల చేసింది.

విద్యార్థి యొక్క పుట్టిన తేదీ, మతం, కులం, ఉప కులం, లింగం, జాతీయత, పొటో, సంతకం వంటి వాటిలో అప్లోడింగ్ చేసేటప్పుడు దొర్లిన తప్పులను సరిచేసుకోవాలని ప్రిన్సిపాల్ లకు సూచించారు.

Follow Us@