షార్ట్ టర్మ్ వొకేషనల్ కోర్సు అనుమతికి దరఖాస్తులు

హైదరాబాద్ (మార్చి 04) : ఇంటర్మీడియట్ లో షార్ట్ టెర్మ్ వొకేషనల్, సర్టిఫికెట్ కోర్సులను నిర్వహించే కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు ఇవ్వనున్నది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను శుక్రవారం ఇంటర్ బోర్డులో అంతర్భాగంగా ఉన్న స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది.

రాష్ట్రంలోని ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలు కోర్సుల అనుమతికి ఈ నెల 15 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు.

◆ వెబ్సైట్ : www.sive.telangana.gov.in