ఇంటర్మీడియట్ పరీక్ష పీజు తేదీలను ప్రకటించిన బోర్డ్.

తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు 2021 కొరకు పరీక్ష ఫీజు చెల్లించుటకు తేదీలను ప్రకటిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న జనరల్ అండ్ వోకేషనల్ గ్రూపులకు చెందిన విద్యార్థులు అలాగే ప్రైవేటు విద్యార్థులు మరియుబ్యాక్ లాగ్స్ ఉన్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని ఒక ప్రకటనలో కమిషనర్ ఉమర్ జలీల్ తెలిపారు.

ఎలాంటి ఆలస్య పీజు లేకుండా పిబ్రవరి 11 వరకు పీజు చెల్లించవచ్చు.

100 రూపాయల పైన్ తో పిబ్రవరి 22 వరకు,

500 రూపాయల పైన్ తో మార్చి 2 వరకు,

1000 రూపాయల పైన్ తో మార్చి 9 వరకు,

2000 రూపాయల పైన్ తో మార్చి 16 వరకు గడువు కలదు.

Follow Us@