నేడే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.

రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కు సంబంధించిన వార్షిక పరీక్షల షెడ్యూలును ఈ రోజు విడుదల చేయడానికి ఇంటర్ బోర్డ్ కసరత్తు చేస్తోంది. మే 15 లోపు ఇంటర్ పరీక్షలు పుర్తి అయ్యోలా షెడ్యూల్ ఉండనుందని విద్యాశాఖ మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

అలాగే ఫిబ్రవరి 1 నుండి ఒకరోజు ఫస్ట్ ఇయర్ తర్వాతి రోజు సెకండ్ ఇయర్ తరగతులను నిర్వహించాలని లేదా షిప్ట్ సిస్టంలో తరగతులను నడుపుకోవాలని తెలిపారు.
ఆన్లైన్/ డిజిటల్ తరగతుల ద్వారా ఇప్పటికే 70 శాతం సిలబస్ పూర్తయిందని మిగతా సిలబస్ ను కళాశాలలో నేరుగా బోధించాలని పేర్కొన్నారు.

వార్షిక పరీక్షలకు తక్కువ సమయం ఉండటంవల్ల సైన్స్ విద్యార్థులకు ప్రతిరోజు ప్రాక్టికల్ చేయించాలని సూచించారు.

Follow Us@