అనుమతి లేకుండా అడ్మిషన్లు, తరగతులు తీసుకుంటున్న ప్రైవేటు జూ. కళాశాలల అనుమతులు రద్దు చేస్తాం – ఇంటర్ బోర్డు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఎలాంటి అనుబంధ గుర్తింపు తీసుకోకుండానే అనుమతి లేని భవనాలలో భౌతిక తరగతులు నిర్వహిస్తున్నట్లు అలాగే అడ్మిషన్లు తీసుకున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డుకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాలకు ఇంటర్మీడియట్ బోర్డు హెచ్చరిక జారీ చేసింది.

అనుబంధ గుర్తింపు పొందకుండానే అడ్మిషన్లు తీసుకుంటూ, అనుమతి లేని భవనాలలో భౌతిక తరగతులు నిర్వహిస్తూ, ఇష్టం వచ్చినట్లు పీజుల వసూలు చేస్తున్న ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాలపై తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేస్తున్న మార్గదర్శకాలను, ఉత్తర్వులను తుచ తప్పకుండా పాటించాలని హెచ్చరిక జారీ చేసింది. లేనిపక్షంలో కళాశాల అనుమతులను రద్దు చేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.