ఇంటర్ వొకేషనల్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ (మే – 20) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వొకేషనల్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 12 నుండి 19వ తారీఖు వరకు ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం సెషన్ లో ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం సేషన్ లో ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం సెషన్ 9.00 – 12.00 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 నుంచి 5.30 వరకు నిర్వహిస్తారు.

వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉదయం సెషన్ 9.00 – 12.00 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.00 నుంచి 5.00 వరకు నిర్వహిస్తారు.

ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 21న, పర్యావరణ విద్య పరీక్ష జూన్ 22న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నారు.