హైదరాబాద్ (జూలై – 07) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ ఈరోజు జూన్ మాసంలో నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష 2023 ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులకు ఫలితాల పట్ల ఏమైనా అనుమానాలు ఉంటే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ సౌలభ్యం కలదని (ts inter recounting and te verification) ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించింది.
జూలై 8 నుండి 12వ తేదీ వరకు రీకౌంటింగ్, వెరిఫికేషన్ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్ కు 100/; రూపాయలు, రీ వెరిఫికేషన్ కు 600/- రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.