ఇంటర్ విద్యార్థులకు రిలయన్స్ స్కాలర్‌షిప్

హైదరాబాద్ (జనవరి – 06) : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ కోసం రిలయన్స్, తెలంగాణ ఇంటర్ బోర్డ్ మధ్య గురువారం అవగాహన ఒప్పందం జరిగింది.

ఇంటర్ ఒకేషనల్ కోర్సులు చదివే వారితో పాటు, రెగ్యులర్ విద్యార్థులూ ఆసక్తి ఉంటే ఇందులో చేరవచ్చని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిట్టల్ ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్ కు సూచించారు.

రిటైల్ మార్కెటింగ్ లో ఆరునెలల కాల పరిమితితో రిలయన్స్ ఈ శిక్షణ నిర్వహిస్తుంది. ఆన్లైన్లో జరిగే ఈ శిక్షణకు ప్రిన్సిపాళ్ల ద్వారా విద్యా ర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డ్ సూచించింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తక్షణం ఉపాధి అందించే ఉద్దేశంతో ఒకేషనల్లో దీన్ని ప్రవేశపెట్టినట్టు అధికారులు తెలి పారు. శిక్షణ కాలంలో రిలయన్స్ నెలకు రూ. 4వేల ఉపకార వేతనం ఇస్తుందని అధికారులు వివరించారు.

మార్కెటింగ్లో మెళకువలు, వ్యాపార విధానాలు నేర్పడం ఈ కోర్సు ఉద్దేశమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు చేరువలో మాల్స్, రిటైల్ మార్కెటింగ్ వ్యవస్థ చొచ్చుకొస్తున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా ఈ శిక్షణ ఇస్తారు.