నేడు ఇంటర్ సెకండియర్ ఫలితాలు- మరి హాల్ టికెట్ నెంబర్ తెలుసా.?

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ రేపు అనగా సోమవారం నాడు ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నది. ఈ నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు చూసుకోవడానికి మీకు మీ ద్వితీయ సంవత్సరం హాల్ టికెట్ నెంబర్ తెలుసా.?

హాల్ టికెట్లు జారీ చేయకముందే పరీక్షలు వాయిదా పడటంతో చాలా మంది విద్యార్థులకు హాల్ టికెట్ నెంబర్లు తెలియవు. దీనితో పరీక్ష ఫలితాలను ఎలా చూసుకోవాలి అని సందేహాలు నెలకొన్నాయి.

అయితే హాల్ టికెట్ నెంబర్ తెలుసుకోవాలంటే కింద లింకును ఓపెన్ చేసి మీ ప్రథమ సంవత్సరం హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయడం ద్వారా ద్వితీయ సంవత్సరం హాల్ టికెట్ నెంబర్ కనుగొనవచ్చు.

ద్వితీయ సంవత్సరం హల్ టికెట్ నంబర్ కోసం లింక్ ::

https://tsbie.cgg.gov.in/secondYearStudentCheckListForEamcet.do

ద్వితీయ ఇంటర్ ఫలితాల కోసం లింక్ ::

https://tsbie.cgg.gov.in/