తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం(2020-21) ఫలితాలు విడుదల అయ్యాయి. మొదటి సంవత్సరంలో 49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫలితాల్లో 56 శాతం బాలికలు, 42 శాతం బాలురు ఉత్తీర్ణులైనట్లు పేర్కొంది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా, 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తులకు ఈ నెల 22 వరకు గడువు విధించినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
రీకౌంటింగ్ కోసం పేపర్‌కు రూ.100, స్కాన్ కాపీతో పాటు రీవెరిఫికేషన్ కావాలనుకునే విద్యార్థులు పేపర్‌కు రూ.600 ఫీజు చెల్లించి ఈ సేవలు పొందవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.
Follow Us @