ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల విడుదల వాయిదా.!

  • ఫలితాల తేదీని త్వరలో ప్రకటించే అవకాశం.

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల విడుదల వాయిదా పడినట్లు సమాచారం. వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా సాయంత్రం ప్రకటనను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసే అవకాశం ఉంది.

పరీక్ష ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు అనేది సాయంత్రం వరకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన చేసే అవకాశం ఉంది.

కరోనా కారణంగాఈ ఏడాది పరీక్షలు రద్దు కావడంతో ప్రథమ సంవత్సరంలో సాధించిన మార్కులను ద్వితీయ సంవత్సరంలో కూడా కేటాయిస్తున్నట్లు మార్గదర్శకాలు గతంలోనే విడుదలైన విషయం తెలిసిందే. ప్రథమ సంవత్సరంలో తప్పిన సబ్జెక్ట్లు మరియు ప్రైవేటుగా పీజు కట్టిన విద్యార్థులకు 35 శాతం మార్కులను కేటాయించనున్న విషయం తెలిసిందే.

మొత్తం ద్వితీయ సంవత్సరం పరీక్ష పీజు కట్టిన విద్యార్థులు 4,73,967 మంది ఉండగా వారిలో 1,99,019 మంది తొలి ఏడాదిలో కొన్ని సబ్జెక్టుల్లో తప్పినవారున్నారు. వీరికి ఆ సబ్జెక్టుల్లో 35 శాతం మార్కులు ఇవ్వనున్నారు.