ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు వాయిదా

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ సెకండియర్ సైన్స్ విద్యార్థులకు నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంతకుముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మే 29వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరపవలసి ఉన్నది. కానీ కరోనా మరియు లాక్ డౌన్ వంటి కారణాలతో ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి తెలిపారు.

అలాగే జూన్ మొదటి వారంలో జరిగే సమీక్షా సమావేశంలో పరీక్ష తేదీల మీద నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామని తెలిపారు.

Follow Us@