ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా.! నైతికత & పర్యావరణ పరీక్షలు అసైన్మెంట్ రూపంలో – ఉమర్ జలీల్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తాత్కాలికంగా విద్యాసంస్థల మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్‌ 1, 3 తేదీల్లో నైతిక విలువలు & పర్యావరణం పరీక్షలను అసైన్‌మెంట్‌ రూపంలో జరపాలని తెలంగాణ ఇంటర్‌బోర్డు నిర్ణయించింది.

కరోనా తీవ్రతతో కళాశాలల మూతపడినందున అసైన్‌మెంట్‌ రూపంలో ఇస్తే సరిపోతుందని విద్యార్థులకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ సూచించారు.

అలాగే ఏప్రిల్‌ 7 నుంచి సెకండ్ ఇయర్ విద్యార్థులకు జరిగే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ కూడా వాయిదా పడే అవకాశముందని జలీల్‌ చెప్పారు.

మే1 నుంచి వార్షిక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వార్షిక పరీక్షలు లేకుండా విద్యార్థులను పాస్‌ చేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. రెండు రోజుల్లో హాల్‌టికెట్లు జారీ చేస్తామన్నారు.

Follow Us@