ఇంటర్ విద్యార్థులకు గ్రూప్, మీడియం మార్చుకునే అవకాశం – ఇంటర్ బోర్డు

తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఎవరైనా వారు ఎంచుకున్న గ్రూప్ కాకుండా మరొక గ్రూపుకు మారాలన్న, మీడియం మార్పు చేసుకోవాలన్నా, వారి పేర్లలోని తప్పులను సరి చేసుకోవాలన్న మరియు ద్వితీయ లాంగ్వేజ్ మార్చుకోవాలన్నా తమ కళాశాలలో రుసుం చెల్లించి మార్చుకునేందుకు ఏప్రిల్ 9 వరకు గడువు ఉన్నది.

  • పేరు మార్పునకు 500 రూపాయలు మీడియం మార్పునకు,
  • ద్వితీయ లాంగ్వేజ్ మార్పునకు 1,000 రూపాయలు
  • గ్రూప్ మార్పునకు 3,000 రూపాయలు రుసుము చెల్లించి మార్పులు చేసుకునే అవకాశం విద్యార్థులకు కలదు అని ఒక ప్రకటనలో ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి.
Follow Us@