ఆగస్టులో ఇంటర్మీడియట్ పస్టీయర్ పరీక్షలు.!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కారణంగా ఇంటర్మీడియట్ పస్టీయర్ పబ్లిక్ పరీక్షలు వ్రాయకుండానే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలోకి ప్రమోట్‌ అయిన విద్యార్థులకు మొదటి ఏడాది పరీక్షలను ఆగస్టులో నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు సిద్దమవుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ప్రథమ సంవత్సరం విద్యార్థులను మాత్రం రెండో సంవత్సరం ప్రమోట్‌ చేశారు. భవిష్యత్తులో సాధ్యమైతే పరీక్షలు జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వం అనుమతి ఇస్తే ఆగస్టు మొదటి వారంలో పరీక్షలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇంటర్‌బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించినట్లు సమాచారం.