రికార్డుల ఆధారంగా ప్రాక్టికల్ మార్కులు.?

కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఈసారి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే అవకాశం లేదని. ఈ నేపథ్యంలో 2,62,169 మంది అందజేసే రికార్డుల ఆధారంగా ప్రాక్టికల్ మార్కులు వేసేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపడుతోందని. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం.

ప్రాక్టికల్స్ నిర్వహణ కూడా ఈ సారి సమస్యగా మారింది. దీంతో ప్రాక్టికల్స్ రికార్డుల ఆధారంగా మార్కులు వేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేలా ఇంటర్ బోర్డు షెడ్యూలు జారీ చేసింది. అయితే అది సాధ్యపడలేదు.

అలాగే ఏప్రిల్లో నిర్వహించాల్సిన ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేసింది. మేలో వార్షిక పరీక్షల తర్వాత నిర్వహిస్తామని పేర్కొంది. ప్రథమ సంవత్సర వార్షిక పరీక్షలను ప్రస్తుతానికి రద్దు చేస్తున్నామని, భవిష్యత్తులో వీలైతే నిర్వహి స్తామని స్పష్టం చేసింది. ఇదే బాటలో రెండో సంవత్సర వార్షిక పరీక్షలను కూడా బోర్డు వాయిదా వేసింది.

జూన్ మొదటి వారంలో కరోనా కేసుల పరిస్థితిని సమీ క్షించాక పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్నది నిర్ణయిస్తామని, 15 రోజుల ముందు వివరాలు తెలుపుతామని పేర్కొంది. దీంతో ప్రాక్టికల్ పరీక్షలను కూడా నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే విద్యార్థులు సమర్పించే రికార్డుల ఆధారంగానే ప్రాక్టికల్ మార్కులు వేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

ప్రథమ సంవత్సర మార్కుల ఆధారంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మార్కులు వేస్తారన్న వాదనలను బోర్డు అధికారులు ఖండించారు. మరోవైపు జాతీయ స్థాయిలో 12వ తరగతి విద్యార్థుల విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయం తర్వాత ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల విషయంపై జూన్ నెలలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Follow Us@