ఇంటర్మీడియట్ పరీక్షల రీషెడ్యూల్

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు షెడ్యుల్ లో స్వల్ప మార్పులు చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డ్ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది.

అక్టోబర్ 29, 30 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను అక్టోబర్ 31 నవంబర్ ఒకటో తేదీ లోకి మారుస్తూ ఉత్తర్వులు వెలువరించింది. కావున విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు పై విషయాన్ని గమనించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అక్టోబర్ – 25 – 2021 : సెకండ్ లాంగ్వేజ్ – I

అక్టోబర్ – 26 – 2021 : ఇంగ్లీష్ – I

అక్టోబర్ – 27 – 2021 : బోటనీ/మ్యాథ్స్ -1A / సివిక్స్ – I

అక్టోబర్ – 28 – 2021 : జువాలజీ / మ్యాథ్స్ -1B/ చరిత్ర – I

అక్టోబర్ – 31 – 2021 : ఫిజిక్స్ / ఎకానమిక్స్ – I

నవంబర్ – 01 – 2021 : రసాయన శాస్త్రం / కామర్స్ – I

నవంబర్ – 02 -2021 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ బ్రిడ్జి కోర్స్

నవంబర్ – 03 -2021 : మోడ్రన్ లాంగ్వేజ్ / జాగ్రపీ – I