నైతిక విలువలు, పర్యావరణ విద్య పరీక్షలపై సందిగ్దత.

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా రాసి ఉత్తీర్ణత కావాల్సిన నైతిక, మానవీయ విలువలు మరియు పర్యావరణ విద్య పరీక్షలు ప్రతి సంవత్సరం జనవరి 29, 31 తేదీలలో జరుగుతాయి. అయితే ఈ విద్యా సంవత్సరం కోవిడ్ కారణంగా పిబ్రవరి 1 నుంచి భౌతికంగా తరగతులు ప్రారంభం కావడంతో ఈ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది.

ఇప్పటివరకు ఈ పరీక్షలపై ఇంటర్‌ బోర్డు స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు ఆన్‌లైన్‌ బోధన కొనసాగుతోంది. అందుకే ఈ విద్యా సంవత్సరానికి ఈ రెండు పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల పై కొంత ఒత్తిడి తగ్గుతుందని, పబ్లిక్ పరీక్షలు వ్రాసే సబ్జెక్టులపై పూర్తి దృష్టి పెట్టేందుకు వెసులుబాటు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us@