ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు సిద్ధం – ఒమర్ జలీల్

కోవిడ్ మహమ్మారి మరియు లాక్‌డౌన్ కారణంగా 2020 – 21 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రత్యక్షంగా తరగతులు నిర్వహించలేకపోయిన నేపథ్యంలో అక్టోబర్ 25 నుండి ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.

  • IPE- 2021 మొదటి సంవత్సరం పరీక్ష ప్రశ్నాపత్రాలు 70% సిలబస్ తో తయారు చేయబడ్డాయి. కావునా 70% సిలబస్ ఈ వెబ్‌సైట్‌లో ఉంచబడింది : tsbie.cgg.gov.in.
  • IPE మొదటి సంవత్సరం ప్రశ్నాపత్రాలలో ప్రశ్నలలో చాయిస్ పెంచబడింది. ప్రతి సబ్జెక్ట్ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ లను
    వెబ్‌సైట్‌లో ఉంచడం జరిగింది : tsbie.cgg.gov.in.
  • మొదటి సంవత్సరం ప్రాథమిక లెర్నింగ్ మెటీరియల్‌ను వెబ్‌సైట్‌లో ఉంచడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. విద్యార్థులు ఈ మెటిరీయల్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
  • విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయని,
    విద్యార్థులు పరీక్షలను ఎలాంటి ఒత్తిడి లేదా భయం లేకుండా వ్రాయలని ఇంటర్మీడియట్ విద్యా కార్యదర్శి ఒమర్ జలీల్ తెలిపారు

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లో కళాశాల మారిన విద్యార్థులు ప్రథమ సంవత్సరం పరీక్షలకు పరీక్ష ఫీజు చెల్లించిన కళాశాల నుండి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది