హైదరాబాద్ (జనవరి 26) : తెలంగాణలో ఇంటర్ జవాబు పత్రాలను ఆన్లైన్ లో మూల్యాంకనం చేసేందుకు ఇటీవలే ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ ఏడాది 35 లక్షల జవాబుపత్రాలను మూల్యాంకనం చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. బిడ్ల దాఖలుకు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 9 వరకు అవకాశం కల్పించింది.
బార్ కోడ్ ఆధారంగా జవాబు పత్రాలను స్కాన్ చేసి వాల్యుయేటర్లకు పంపించి మూల్యాంకనం చేయడం ఈ విధానం ప్రత్యేకత. ఈ ఏడాది 95 లక్షలు, వచ్చే ఏడాది 45 లక్షలు, 2025లో 55 లక్షల జవాబుపత్రాలను ఆన్‌స్క్రీన్ మూల్యాంకనం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆన్లైన్ మూల్యాంకనంలో ఈ విద్యాసంవత్సరం సైన్స్ సబ్జెక్టులను మినహాయించారు. 2024లో 50 శాతం సైన్స్ పేపర్లు, 2025లో మొత్తం పేపర్లను ఆన్లైన్ మూల్యాంకనం చేయాలని నిర్ణయించారు.
Follow Us @