ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువు పెంపు

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన జారీ చేసింది.

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ప్రకటనలో పేర్కొన్నారు.