ఇంటర్ అడ్మిషన్ల గడువు డిసెంబర్ 31 వరకు పెంపు

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల కోసం చివరి తేది డిసెంబర్ 12 తో ముగిసిన నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు గడువు తేదీని మరొక్కసారి డిసెంబర్ 31 వరకు పొడిగించడం జరిగింది.

ప్రథమ సంవత్సరాలకు అడ్మిషన్లకు గడువును డిసెంబర్ 31 వరకు పెంచుతూ ప్రకటన జారీ చేయడం జరిగింది. దీనితో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, – ఎయిడెడ్, అన్ఎయిడెడ్, కేజీబీవీ, గురుకుల జూనియర్ కళాశాలలో డిసెంబర్ – 31 వరకు ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగించాలని ఇంటర్ బోర్డు వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

Follow Us@