INTER : నేటితో ముగుస్తున్న అడ్మిషన్ల గడువు

హైదరాబాద్ (జూలై – 31) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2023 – 24 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల గడువు ప్రైవేటు విద్యా సంస్థలలో ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా నేటితో ముగుస్తుంది.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆగస్టు 1 నుండి ఆగస్టు 16 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అడ్మిషన్లు పొందవచ్చు.

ఆగస్టు 1 నుండి ఆగస్టు 16 వరకు 500/- రూపాయల ఆలస్య రుసుముతో ప్రైవేటు విద్యా సంస్థలలో అడ్మిషన్లు పొందవచ్చు.

విద్యార్థులు కేవలం ఇంటర్మీడియట్ బోర్డు చేత గుర్తింపు పొందిన జూనియర్ కళాశాలలోనే అడ్మిషన్లు పొందాలి. గుర్తింపు పొందిన కళాశాల వివరాలు బోర్డు వెబ్సైట్ అందుబాటులో ఉన్నాయి.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పొందడానికి కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.

INTER ADMISSIONS LINK

◆ వెబ్సైట్ : https://tsbie.cgg.gov.in/home.do