వరంగల్ (జూలై 24): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్ ఐసెట్ ను ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
DOWNLOAD HALL TICKETS HERE
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాలుగు సెషన్లల్లో పరీక్షలను నిర్వహిస్తారు.
DOWNLOAD PREVIOUS PAPERS HERE
రాష్ట్రవ్యాప్తంగా 70 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. 76 వేల పైచిలుకు అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ఏదేని ఫొటో గుర్తింపుకార్డును వెంట తెచ్చుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు. విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.