Court Jobs : డ్రైవర్ ఉద్యోగ అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ ఖరారు

హైదరాబాద్ (జూన్ – 12) : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పరిధిలో డ్రైవర్ పోస్టులను భర్తీ కోసం జనవరి మాసంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూ కం 1:3 నిష్పత్తిలో ఎంపిక చేశారు. వీరికి సంబంధించిన హాల్ టికెట్ల నెంబర్లను విడుదల చేశారు.

ఈ అభ్యర్థులకు జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 3:30 నిమిషాలకు తెలంగాణ హైకోర్టు ఆవరణలో ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేయనున్నారు

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 25, 26, 27వ తేదీలలో స్కిల్ టెస్ట్ మరియు డ్రైవింగ్ టెస్ట్ నం నిర్వహించారు.

వెబ్సైట్ : https://tshc.gov.in/getRecruitDetails