తెలంగాణ ప్రభుత్వనికి కృతజ్ఞతలు తెలిపిన కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ చైర్మన్ కనక చంద్రం

  • డాక్టరేట్ అసోసియేషన్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ కు వ్యతిరేకంగా వేసిన కోర్ట్ కేస్ నెంబర్ WP NO 17709/22 ని కొట్టేసిన హై కోర్ట్ ధర్మాసనం

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ వద్ద తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ కోసం ఇచ్చిన జీవో నెంబర్ 16 కు వ్యతిరేకంగా వేసిన కేస్ ను అడ్వాకేట్ జనరల్ వాదనలు విని చీఫ్ జస్టిస్ డిస్మిస్ చేయడం జరిగిన నేపథ్యంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ జే.ఏ.సి చైర్మన్ కనక చంద్రం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి దృఢ నిశ్చయంతో ఉందని… ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి తీరుతుందని తెలిపారు.

క్రమబద్దీకరణ కోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా జీవో నెంబర్ 16 విడుదల చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయడం కోసం కోర్టులో జీవో నెంబర్ 16 పై ఇదివరకే నిరుద్యోగులు వేసిన కేస్ ను కొట్టివేయడం జరిగిందని… క్రమబద్ధీకరణ ప్రక్రియ చురుకుగా సాగుతున్న సమయంలో కుట్ర పూరితంగా కొంత మంది నిరుద్యోగులు డాక్టరేట్ అసోసియేషన్ పేరుతో మళ్లీ కేసు వేయడం జరిగిందని.. ఇంతకుముందే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయవచ్చు అని తీర్పు ఇచ్చినందున వెంటనే ఈరోజు కేస్ ని అడ్వకేట్ జనరల్ డిస్మిస్ చేయాలని చీఫ్ జస్టిస్ ని కోరడం జరిగింది వెంటనే చీఫ్ జస్టిస్ గారు కేసును డిస్మిస్ చేయడం జరిగిందని వివరించారు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా తొలగిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి, కాంట్రాక్టు లెక్చరర్ల గౌరవ అధ్యక్షులు రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావుకి యావత్ కాంట్రాక్టు ఉద్యోగుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కనకచంద్రం ప్రకటన విడుదల చేశారు.

Follow Us @