TS GURUKULA JOBS : అభ్యర్థులకు కీలక నిబంధనలు

హైదరాబాద్ (జూలై – 29) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) వివిధ గురుకుల విద్యాసంస్థల్లో భర్తీ చేయనున్న 9,210 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం ఆగస్టు 01 నుండి 23వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షలకు అభ్యర్థులకు కీలకమైన నిబంధనలు (ts gurukula jobs important rules) ప్రవేశపెట్టారు.

◆ నిబంధనలు :

ఆగస్టు 01 నుండి 23వ తేదీ వరకు ప్రతిరోజు మూడు షిఫ్టులలో పరీక్షలు నిర్వహించనున్నారు.

అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఒక గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. గుర్తింపు కార్డు లేకుంటే పరీక్ష గదిలోకి అనుమతించరు.

హాల్ టికెట్ పై ఫోటో ప్రింట్ కాకుంటే మూడు పాస్పోర్ట్ సైజు ఫోటోలపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ అండర్టేకింగ్ ధ్రువీకరణ పత్రం తీసుకుని ఇన్విజిలేటర్ కు ఇవ్వాలి. లేకుంటే పరీక్షకు అనుమతి లేదు.

అభ్యర్థులు ఎలాంటి కాగితాలను ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకొని రాకూడదు

అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించి రావాలి. బూట్లతో పరీక్ష గదిలోకి అనుమతి లేదు

హాల్ టికెట్, గుర్తింపు కార్డు, నామినల్ రోల్ లలో ఫోటోలు వేరువేరుగా ఉన్నా… అభ్యర్థి వ్యక్తిగత ధ్రువీకరణలో లోపాలు గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.

నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు హాల్ టికెట్లను భద్రంగా దాచుకోవాలి.

పరీక్షా కేంద్రానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం యొక్క గేట్లు మూసివేయబడతాయి. ఆ తర్వాత ఇట్టి పరిస్థితుల్లో అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు

పరీక్షా కేంద్రం నుంచి పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు వెళ్లేందుకు అభ్యర్థులకు అనుమతి లేదు

పరీక్ష పేపర్ – 1, 2, 3 ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నారు.

పరీక్ష ప్రారంభానికి 10 నిమిషాల ముందు పాస్వర్డ్ చెబుతారు. కంప్యూటర్ లో దీని నమోదు చేశాక అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు వస్తాయి.

పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి స్క్రీన్ పై ప్రశ్నలు ప్రత్యక్షమవుతాయి. పరీక్ష సమయం ముగిశాక స్క్రీన్ అదృశ్యం అవుతుంది.

పరీక్ష సమయంలో ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తిన అందుకు సంబంధించిన అదనపు సమయాన్ని ఆటోమేటిగ్గా అభ్యర్థులు పొందవచ్చు.