హైదరాబాద్ (జూన్ – 10) : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి గడువును ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి రోనాల్డ్ రాస్ తెలిపారు.
2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్‌ను (VTG CET 2023) నిర్వహించడంతోపాటు అర్హత సాధించిన విద్యార్థుల మొదటి జాబితాను ఇటీవలనే విడుదల చేశారు. 10వ తేదీలోగా కేటాయించిన గురుకులాల్లో అడ్మిషన్ రిపోర్ట్ చేయాలని సూచించారు. తాజాగా అందుకు సంబంధించిన గడువును 15వ తేదీ వరకు పొడిగించారు.