ఆప్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో గెస్ట్ లెక్చరర్లను “రెన్యూవల్” చేయాలి

  • రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1500 మంది గెస్ట్ లెక్చరర్ల ను కొనసాగించి ప్రభుత్వం ఆదుకోవాలి

తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత 6, 7 సంవత్సరాలుగా పనిచేస్తున్న దాదాపు 1500 మంది గెస్ట్ లెక్చరర్లను ప్రస్తుత విపత్కర పరిస్థితుల దృష్ట్యా ఫిబ్రవరి 1 నుండి “ఆఫ్లైన్” తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో “రెన్యూవల్” చేసి ఆదుకోవాలి.

కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో.. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం పూర్తిగా ఆలస్యం కావడంతో ఆ ప్రభావం కళాశాలల మనుగడ, పేద విద్యార్థులు, అద్యాపకులపై పడింది. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలో పనిచేస్తున్న ఇతర తాత్కాలిక ఉద్యోగులైన ఎంటీఎస్, కాంట్రాక్ట్, పార్ట్ టైం హవర్లీ లెక్చరర్లకి “రెన్యూవల్” చేశారు.. కానీ ఇంతవరకు గెస్ట్ లెక్చరర్ల రెన్యూవల్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇప్పటికే దాదాపు సంవత్సరం కావొస్తున్నా ఎలాంటి ఉపాధి, వేతనాలు లేక గెస్ట్ లెక్చరర్లంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో గతంలో ప్రభుత్వం ఫిజికల్ గా తరగతులు ప్రారంభమైతే గెస్ట్ లెక్చరర్లను కొనసాగిస్తామని అధికారులు స్వయంగా హామీ ఇచ్చారు. ఇంటర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా నడుస్తున్న క్రమంలో..కొన్ని గ్రూపులు, సబ్జెక్టులు పూర్తిగా గెస్ట్ లెక్చరర్ల పై ఆధారపడి ఉన్నాయని రెన్యూవల్ విషయంలో ఇంకా ఆలస్యమైతే ఆయా గ్రూపులలో ప్రత్యేక శ్రద్ద కొరవడటం వల్ల అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. అదేవిధంగా సెప్టెంబర్ నెలనుండి ఆన్లైన్ క్లాసులు నడుస్తున్న క్రమంలో గెస్ట్ లెక్చరర్లు బోధించే సబ్జెక్టులలో పూర్తి స్తాయిలో విద్యార్థుల సందేహాల నివృత్తి, క్లాసుల హాజరుపై పర్యవేక్షణ కరవయ్యింది. అంతేగాక ఇది ఇలానే కొనసాగితే తదుపరి కళాశాలల్లో ప్రవేశాలు పొందిన పేద విద్యార్థుల రిజల్ట్స్ పై ప్రభావం పడే ప్రమాదముంది.

ఇప్పటికే పలుమార్లు కరోనా విపత్కర పరిస్థితులను సైతం లెక్కచేయకుండా “రెన్యూవల్” విషయంపై విద్యాశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంటర్ విద్యా కమీషనర్, ప్రభుత్వ పెద్దలైన బి. వినోద్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు, అధికారులను కలిసి విన్నవించినప్పటికీ ఇంకా ప్రభుత్వ నిర్ణయం ఆలస్యమవుతుండటంతో..ఇప్పటికైనా తమ గోడును ప్రభుత్వం అర్థం చేసుకుని త్వరగా రెన్యూవల్ చేస్తే కళాశాలల్లోని ప్రిన్సిపాల్లు మరియు ఇతర అధ్యాపకుల సహకారం తీసుకుని ఇంకా అవకాశం ఉన్నంత మేరకు అడ్మిషన్ల ప్రక్రియ, ఆన్లైన్ లేదా..బౌతిక తరగతుల నిర్వాహణ లోనూ భాగస్వాములమై ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతం లో భాగంగా మా వంతు కృషిని తప్పకుండా అందిస్తాము.

ఇకనైనా..ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లు అందించిన సేవలను మరియు కోవిడ్ -19 ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మానవతా ధృక్పథంతో జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్లను ఇతర తాత్కాలిక ఉద్యోగుల మాదిరిగా ఈ విద్యాసంవత్సరంలో మిగిలిన 2 లేదా 3 నెలలకోసం నూతన నోటిఫికేషన్ ప్రస్తావన లేకుండా..ఇదివరకు పలుమార్లు చేసిన మా విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని భౌతిక తరగతుల ప్రారంభం కంటే ముందే పాతవారినే “రెన్యూవల్” చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యేలా..సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంటర్మీడియట్ కమీషనర్ లు చొరవ తీసుకొని గెస్ట్ లెక్చరర్లను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము.

కొన్ని గ్రూపులు, సబ్జెక్టులు పూర్తిగా గెస్ట్ లెక్చరర్ల పై ఆధారపడి ఉన్నాయని రెన్యూవల్ విషయంలో ఇంకా ఆలస్యమైతే ఆయా గ్రూపులలో ప్రత్యేక శ్రద్ద కొరవడటం వల్ల అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు.

దార్ల భాస్కర్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సెల్: 9951282919
ప్రభుత్వ జూనియర్ కళాశాలల అతిథి (గెస్ట్) అధ్యాపకుల సంఘం

Follow Us@