పల్లా, వాణీ దేవిలకు సంపూర్ణ మద్దతు – డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం

ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి మరియు హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి సురభి వాణీదేవిలకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ ల తరపున పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లు సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ తమకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 12 నెలల వేతనం, బేసిక్ పే ఇవ్వడం జరిగిందని, క్రమబద్ధీకరణ కొరకు జీవో నంబర్ 16 ను కూడా విడుదల చేశారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే తమ సమస్యలకు పరిష్కారం లబిస్తుందని తెలిపారు.

Follow Us@