ప్రభుత్వము తక్షణమే కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను ప్రారంభించాలి


జయశంకర్ భూపాలపల్లి జిల్లా :: కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016వ సంవత్సరంలో జీవో నెంబర్ 16ను జారీ చేయడం జరిగింది కానీ కొందరు కుట్రపూరితంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ ను రెగ్యులరైజేషన్ చేయకూడదని కేసు వేయడం జరిగింది చివరికి ఈ కేసులో న్యాయం ధర్మం గెలిచిందని భూపాల్ పల్లి జిల్లా కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 అధ్యక్షులు బొజ్జ అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి మియాపురం సదాశివ ,మహిళా కార్యదర్శి పొలాస ఇందిరా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ణజీ అన్నారు.


కాంట్రాక్ట్ లెక్చరర్ల సుదీర్ఘ న్యాయ పోరాటాల ఫలితంగా హైకోర్టు తీర్పు అని న్యాయాన్ని కాపాడిన లాయర్లకు ప్రభుత్వ పెద్దలకు న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు. కొంత మంది నిరుద్యోగులు చేత పిన్ నెంబర్ 122/2017 వేసిన దానిని హైకోర్టు మంగళవారం కొట్టివేయడం జరిగింది అదేవిధంగా కోర్టు సమయాన్ని వృథా చేయటమే కాకుండా కాంట్రాక్ట్ లెక్చరర్ల 8సంవత్సరాల రెగ్యులరైజేషన్ కు అడ్డుపడిన వారిపై 1000/- జరిమానా విధించి న్యాయాన్ని గెలిపించడం శుభ పరిణామమని అన్నారు

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల కు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయినందున ప్రభుత్వం తక్షణమే స్పందించి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Follow Us @