కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలి

ములుగు జిల్లా :: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ను వ్యతిరేకిస్తూ హైకోర్ట్ లో వేసిన పిల్ ను కోర్ట్ కొట్టివేస్తూ పిల్ వేసిన వారిని తీవ్రంగా మందలిస్తూ 1000రూ జరిమానా విధించడం జరిగింది. హైకోర్ట్ తీర్పును ములుగు జిల్లా కాంట్రాక్టు లెక్చరర్లు తరుపున అధ్యక్ష , కార్యదర్శులు గణపతి, హరి గోపాల్ యాదవ్, చరణ్ సింగ్, శ్వేత స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

ఇన్ని రోజులు కోర్ట్ తీర్పు అడ్డంకిగా ఉందని ప్రభుత్వం సాకుగా చూపిందని, ఇకనైనా రెగ్యులరైజేషన్ ప్రక్రియ త్వరగా ప్రభుత్వం చేపట్టాలని వేడుకున్నారు.

Follow Us @