కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్ కు సర్కార్ చొరవ చూపాలి – విజయమొహన్, రాజిరెడ్డి

వరంగల్ :: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్స్/ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు 2016 లో జారీ చేసిన జీవో 16 పై నిరుద్యోగుల వేసిన పిల్ నంబర్ 122/17 ను మంగళవారం హైకోర్టు కొట్టివేయడాన్ని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం 475 వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బూర విజయమొహన్, పాతూరి రాజిరెడ్డిలు స్వాగతించారు.

21 సంవత్సరాలుగా కాంట్రాక్టు అధ్యాపకులు తమ జీవితాలను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అభివృద్ధికి దారపోశారని ఆ విషయాన్ని గౌరవ హైకోర్టు గుర్తించి కాంట్రాక్టు అధ్యాపకులకు న్యాయం చేసిందని, అంతేకాకుండా నిరుద్యోగులు వేసిన ఈ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం వల్లనే హైకోర్ట్ కేసును కొట్టివేయడం జరిగిందని దీనికి కాంట్రాక్టు అధ్యాపకులు కేసీఆర్ ప్రభుత్వానికి ఎంతో ఋణపడి ఉంటామని పేర్కొన్నారు.

ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా రెగ్యులరైజేషన్ కు అవసరమైన మిగతా ప్రక్రియను పూర్తిచేసి కేసీఆర్ ప్రభుత్వం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలుచేసి వారి కుటుంబాలలో వెలుగులను నింపాలని తెలియజేస్తూ ఇందుకు సహకరించిన ప్రభుత్వ పెద్దలు కేటీఆర్ కు, హరీశ్ రావుకి, పాతూరి సుధాకర్ రెడ్డికి, సబితా ఇంద్రారెడ్డికి, శ్రీనివాస్ గౌడ్ కి, టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మరియు హైకోర్టు అడ్వకేట్ జివిఎల్ మూర్తిలకు కాంట్రాక్టు లెక్చరర్స్ అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

Follow Us @