శాఖల వారీగా ఖాళీల లెక్క తేల్చండి – సోమేశ్ కుమార్.

తెలంగాణలోని ఉద్యోగ కల్పన లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో లో 50 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించాలని దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని ప్రభుత్వ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, మరియు సెక్రటరీలతో ఈరోజు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలోవీలయినంత త్వరగా శాఖల వారీగా ప్రత్యక్ష పద్ధతిలో నింపడానికి వీలున్న ఖాళీల సంఖ్యను నివేదించవలసిందిగా ఆదేశించడం జరిగింది.

ఈ కార్యక్రమంలోడీజీపీ మహేందర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు అయినా చిత్ర రామచంద్రన్, శాంతి కుమారి, రాణి కుముదిని ప్రిన్సిపల్ సెక్రెటరీలు సునిల్ శర్మ, రజత్ కుమార్, జయోష్ రంజన్, రవి గుప్తా మరియు సెక్రటరీలు పాల్గొన్నారు.

Follow Us@