హైదరాబాద్ (సెప్టెంబర్ – 17) : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గిరిజన రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జీవో జారీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం 7 శాతంగా రిజర్వేషన్లు ఉన్నాయి.
ఈ రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపి ఏడేళ్లు అవుతున్నా కేంద్రం ఆమోదించలేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. 12 శాతం పెంచాలని కొంతకాలంగా గిరిజనులు డిమాండ్ చేస్తుండగా.. కేసీఆర్ 10 శాతం చేస్తామని ప్రకటించారు.