పదోన్నతి కావలసిన సర్వీస్ రెండు సంవత్సరాలకు కుదిస్తూ ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదోన్నతుల కొరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు పదోన్నతుల దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం పెట్టిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పదోన్నతి కోసం ఉద్యోగికి కావలసిన కనీస సర్వీస్ మూడు సంవత్సరాలు కాగా దానిని రెండు సంవత్సరాలకు కుదిస్తూ జీవో నెంబర్ 3ను ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం జరిగినది.

ఇప్పటివరకు పదోన్నతి పొందాలంటే కనీసం ప్రస్తుతం పనిచేసిన సర్వీసులో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉండాలని నిబంధన ఉన్నది. అయితే రాష్ట్రంలోని అనేక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను నింపడానికి మూడు సంవత్సరాల సర్వీస్ నిబంధన వలన తక్కువ మందికి మాత్రమే పదోన్నతి కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మందికి పదోన్నతులు కల్పించి ఖాళీలను నింపాలని ఉద్దేశంతో రెండు సంవత్సరాలు సర్వీస్ ఉన్న వారికి పదోన్నతి కల్పించేలా తాత్కాలిక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ జీవో ప్రకారం ఈ నిబంధన ఆగస్టు 31 2021 వరకు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని జరిగింది.

Follow Us @