ENGINEERING : నేటి వరకు ఎంసెట్ రిపోర్టింగ్ గడువు

హైదరాబాద్ (ఆగస్టు 13) : తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు కళాశాలలో రిపోర్ట్ చేయడానికి గడువును ఆగస్ట్ 13 వరకు (ts engineering self reporting date extended up to august 13th) పొడిగించారు.

షెడ్యూల్ ప్రకారం రిపోర్టింగ్ గడువు ఆగస్టు 12తో ముగియగా, తాజాగా నేటి వరకు రిపోర్ట్ చేసే అవకాశాన్ని కల్పించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంసెట్ అధికారులు సూచించారు.

ఇప్పటివరకు జరిగిన కౌన్సెలింగ్ లలో సీట్లు పొందిన అభ్యర్థులు నేరుగా సర్టిఫికెట్ లతో కళాశాలను సందర్శించడం ద్వారా సీటు ను కన్పామ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెల్ప్ రిపోర్టింగ్ చేయని అభ్యర్థుల సీటు ఆటోమేటిక్ గా రద్దు అవుతుంది.