తెలంగాణ ఏకలవ్య మోడల్ టీచర్ల ఎంపిక జాబితా విడుదల

హైదరాబాద్ (జూలై – 13) : తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ (TS EMRS CONTRACT JOBS SELECTION LIST) పాఠశాలలో పిజిటి, టిజిటి, లైబ్రేరియన్ వంటి 239 కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయనున్న పోస్టులకు డెమో తరగతులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేశారు.

జూలై 13,14,15వ తేదీలలో డెమో తరగతులకు ఎంపికైన జాబితాలను విడుదల చేశారు. ఈ లిస్టు ఆధారంగా అభ్యర్థులు ఆయా తేదీలలో డెమో తరగతులకు హాజరు కావలసి ఉంటుంది.

CBSE సిలబస్ ను ఇంగ్లీష్ మీడియంలో బోధించుటకు అనుభవజ్ఞులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులు పాఠశాల వద్దనే రెసిడెన్షియల్ పద్ధతిలో ఉండి బోధించాల్సి ఉంటుంది.

TS EMRS CONTRACT JOBS SELECTION LIST