హైదరాబాద్ (మే – 31) : తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 2023 – 24 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో నూతన ప్రవేశాలకు మరియు 7, 8, 9 తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను (TS EMRS EXAM 2023 RESULTS) ఈ రోజు విడుదల చేశారు. మొదటి దశ ప్రవేశాలు జూన్ -01 నుండి 10 వరకు జరగనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 23 ఏకలవ్య ఆదర్శ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు కలవు. ప్రతి పాఠశాలలో ఆరవ తరగతిలో 60 సీట్లు చొప్పున భర్తీ చేస్తారు. ప్రవేశ పరీక్ష మే – 07వ తేదీన జరిగింది.