బీఎడ్ మొదటి దశ సీట్లు కేటాయింపు.

తెలంగాణ రాష్ట్రంలోని బీఈడీ కోర్సుల్లో 2020 – 21 విద్యా సంవత్సరం ప్రవేశానికి కన్వీనర్ కోటాలో మొదటి దశ సీట్ల కేటాయింపు జరిగింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలలో కన్వీనర్ కోటాలో 13510 సీట్లు ఉండగా 18870 మంది విద్యార్థులు మొదటి దశ కౌన్సిలింగ్ హాజరయ్యారు. వీరిలో 10265 మందికి మొదటిదశలో సీట్లు కేటాయించారు.

సీట్లు పొందిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి జాయినింగ్ లెటర్ మరియు చాలన్ పార్మ్ ను డౌన్లోడ్ చేసుకోని ట్యూషన్ ఫీజు ను యూనియన్ బ్యాంక్/ ఆంధ్రా బ్యాంకు ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.

జనవరి 18 నుండి 22 వరకు సీటు పొందిన కళాశాలకు వెళ్లి ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేపించుకొని సీటు కన్ఫామ్ చేసుకోవలసి ఉంటుంది. క్లాసులు జనవరి 21 నుంచి ప్రారంభం కానున్నాయని ఎడ్ సెట్ కన్వీనర్ ప్రో. రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us@