ఎడ్ సెట్ సర్టిఫికెట్ ల అప్లోడింగ్ తేదీ పొడిగింపు

తెలంగాణ ఎడ్ సెట్ 2020 మొదటి దశ కౌన్సిలింగ్ కు సంబంధించిన ప్రక్రియ డిసెంబర్ 10 నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఆన్లైన్లో ఒరిజినల్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడానికి చివరి తేదీని జనవరి 7 – 2021వరకు పెంచుతూ కన్వీనర్ రమేష్ బాబు నిర్ణయం తీసుకున్నారు.

2020 – 21 విద్యా సంవత్సరానికి గాను కన్వీనర్ కోటాలో 13,200 బీఈడీ సీట్లు ఉండగా, ఇప్పటివరకు 18,284 మంది అభ్యర్థులు ఆన్లైన్లో సర్టిఫికెట్లను అప్లోడ్ చేసినట్లు తెలిపారు.

జనవరి 10 న సీట్లు కేటాయించబడిన అభ్యర్థుల లిస్ట్ ను విడుదల.

జనవరి 15 న కళాశాలల వారీగా అభ్యర్థుల లిస్ట్ విడుదల.

జనవరి 18 నుండి 22 వరకు సీట్లు పొందిన అభ్యర్థులు కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్ లు మరియు పీజు ను చెల్లించి సీటును కన్ఫర్మ్ చేసుకోవాలి.

తరగతులు నిర్వహణ జనవరి 21 నుండి ప్రారంభం కానున్నాయి.

Follow Us@