హైదరాబాద్ (మే – 14) : రెండు సంవత్సరాల బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న TS EdCET 2023 హల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. 31,725 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
TS EdCET పరీక్ష మే 18న మూడు సెషన్లల్లో జరుగనున్నదని చెప్పారు. ఉదయం 9 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.