హైదరాబాద్ (సెప్టెంబర్ – 20) : 2023 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండేళ్ల BEd కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన TS EdCET 2023 ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ (TS EdCET COUNSELING SCHEDULE)ను నేటి నుండి ప్రారంభం కానుంది.
సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
వెబ్ ఆప్షన్ల నమోదు అక్టోబర్ 3 నుండి 5 వరకు కలదు సీట్ల కేటాయింపు అక్టోబర్ 9న జరగనుంది. కళాశాలలో రిపోర్టింగ్ గడువు అక్టోబర్ 10 నుండి 13 వరకు కలదు.