TS EdCET 2023 COUNSELING SCHEDULE విడుదల

హైదరాబాద్ (సెప్టెంబర్ – 14) : తెలంగాణ ఉన్నత విద్యాశాఖ 2023 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండేళ్ల బిఈడి కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన TS EdCET 2023 ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ (TS EdCET COUNSELING SCHEDULE)ను విడుదల చేసింది.

TS EdCET-2023లో మొత్తం 26,994 మంది కనీస మార్కులు సాధించి ప్రవేశాల కౌన్సెలింగు అర్హత సాధించారు. గత విద్యా సంవత్సరం(2022-23)లో 211 ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కళాశాలల్లో మొత్తం 18,350 సీట్లు ఉన్నాయని, చివరకు వాటిలో 13,756 మంది ప్రవేశాలు పొందారని కన్వీనర్ చెప్పారు.

సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

TS EdCET COUNSELING SCHEDULE

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దరఖాస్తుల పరిశీలన : సెప్టెంబర్ 20 నుండి 30 వరకు

అభ్యర్థుల జాబితా ప్రదర్శన : అక్టోబర్ 02

వెబ్ ఆప్షన్ల నమోదు : అక్టోబర్ 3 నుండి 5 వరకు

సీట్ల కేటాయింపు : అక్టోబర్ 9న

కళాశాలలో రిపోర్టింగ్ గడువు : అక్టోబర్ 10 నుండి 13 వరకు

వెబ్సైట్ : https://edcet.tsche.ac.in/#