TS EDCET – 2021 నోటిఫికేషన్ విడుదలైంది. రెండు సంవత్సరాల బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఎప్రిల్ 19 నుంచి జూన్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది అన్ని మెథడాలజీలకు ఒకే ప్రశ్నాపత్రం ఉంటుందని ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రామకృష్ణ వెల్లడించారు.
◆ నూతన నిబంధనలు ::
బీఈడీ కోర్సులో పలు మార్పులుచేస్తూ విద్యాశాఖ స్పెషల్‌సీఎస్ చిత్రారామచంద్రన్ సోమవారం జీవో-14 జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ వారితో పాటు బీబీఏ, బీబీఎం, బీసీఏ విద్యార్థులు కూడా బీఈడీ కోర్సుల్లో చేరవచ్చని జీవోలో పేర్కొన్నారు. వీరు డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇంజినీరింగ్ విద్యార్థులు ఎడ్‌సెట్ రాసేందుకు ఇప్పటివరకు 55 శాతం మార్కులు అర్హతగా ఉండగా, తాజాగా 50 శాతానికి తగ్గించారు. డిగ్రీలో కేవలం కెమిస్ట్రీ సబ్జెక్టు ఒక్కటే చదివినా బీఈడీ ఫిజికల్ సైన్స్ మెథడ్‌లో చేరేందుకు అవకాశం కల్పించారు.
● దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్
● దరఖాస్తు ప్రారంభం :: ఎప్రిల్ – 19 – 2021
● చివరి తేదీ :: జూన్ – 15 – 2021
● పరీక్ష తేదీలు :: ఆగష్టు – 24, 25
● పరీక్ష పీజు :: 650/- (ఎస్సీ, ఎస్టీ, PH 450/-)
● వెబ్సైట్ :: https://edcet.tsche.ac.in/TSEDCET/EDCET_HomePage.aspx
● పూర్తి నోటిఫికేషన్ pdf :: https://drive.google.com/file/d/1ALwNq2XKRXCxZBO12vBefCDy49Yci4Y8/view?usp=drivesdk
Follow Us@