హైదరాబాద్ (జూన్ – 12) : TS ECET 2023 RESULTS ను జూన్ 13న మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి(TSCHE) ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేయనున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 20న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 22వేల మందికి పైగా విద్యార్థులు హాజరైనట్టు ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. పాలిటెక్నిక్, బీఎస్సీ (గణితం) పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్ ర్యాంకుల ఆధారంగా బీఈ/ బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తుంటారు.