హైదరాబాద్ (జూలై – 21) : TS EAMCET 2023 ENGINEERING FIRST PHASE COUNSELING లో సీట్లు పొందిన అభ్యర్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు ట్యూషన్ ఫీజు చెల్లింపునకు గడువు తేదీని జూలై 23 వరకు పెంచుతూ ఉన్నత విద్య శాఖ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, ట్యూషన్ ఫీజు చెల్లింపు గడువును జూలై 23 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
మొదటి దశలో సీట్లు పొందిన అభ్యర్థులు ట్యూషన్ ఫీజు చెల్లించని పక్షంలో సీట్లు రద్దు అవుతాయని ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. కావున అభ్యర్థులు సీట్లు కన్ఫామ్ చేసుకోవడానికి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంది.
రెండో దశ ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జూలై 24 నుండి ప్రారంభం కానుంది. జూలై 31న రెండో దశ సీట్లను కేటాయించనున్నారు.