TS EAMCET : కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు

హైదరాబాద్ (జూలై – 06) : తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులను ప్రభుత్వం చేసింది. కొత్తగా మరో 14,565 సీట్లకు అనుమతి లభించడం, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యంతో ఈ మార్పులు జరిగాయి

జూలై 07, 08 వ తేదీలలో ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి.

జూలై 9న వెరిఫికేషన్ ఉంటుంది.

జూలై 12 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు పొడగించారు.

జూలై 16న తొలి విడత, 24న రెండో విడత, ఆగస్టు 4న తుది
విడత కౌన్సెలింగ్ ఉంటుంది.